బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ మంగళవారం భారతదేశంలో 12-18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న వారి కోసం COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇప్పుడు దేశంలోని 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యుక్తవయస్కుల కోసం ఈ కంపెనీ యొక్క COVID-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగాయానికి అనుమతినిచ్చింది. నోవావాక్స్ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే Covovax బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేయబడింది. నోవావాక్స్ ఆమోదం పొందిన తర్వాత కంపెనీ సీఈఓ అదర్ పూనావాలా దీనిని కోవిడ్ పై పైచేయి సాధించే క్రమంలో ఇదొక మైలురాయిగా పేర్కొన్నారు.
నోవావాక్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. NVX-CoV2373 అని కూడా పిలువబడే ఈ టీకా భారతదేశంలో ఈ వయస్సు వారిలో ఉపయోగించడానికి అనుమతి పొందిన మొదటి ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్. డీసీజీఐ ఇప్పుడు 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు COVID-19ని నిరోధించడానికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కోసం Covovax కు అనుమతిని జారీ చేసింది. 2000 కంటే ఎక్కువ నమూనాలను పరీక్షించిన తర్వాత COVID-19కి వ్యతిరేకంగా పనిచేయడంలో ఈ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా ఉందని తెలియజేసింది. దీనిపై పూనావాలా మాట్లాడుతూ.. తమ సంస్థ దానిని ప్రజలకు అందించడం గర్వంగా ఉందని అన్నారు. మన దేశంలోని కౌమారదశలో ఉన్న యువతకు సరిపడే ప్రోటీన్-ఆధారిత COVID-19 వ్యాక్సిన్ను అందించడం మాకు గర్వకారణం అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ