ఏపీ టెట్-2022 ఫలితాలు విడుదల

AP Teacher Eligibility Test-2022 Results Released, AP Teacher Eligibility Test-2022 Results, Teacher Eligibility Test-2022 , Teacher Eligibility Test-2022 Results, Mango News, Mango News Telugu, Teacher Eligibility Test Results, AP Teacher Eligibility Test, AP TET 2022, AP TET 2022 Results, AP TET Results, AP TET Results 2022, AP TET Results Online, AP TET Results Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2022 ను ఆగస్టు 6 నుంచి 21వరకు విడతలవారీగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టెట్-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ ఫలితాలను గురువారం విడుదల చేశారు. టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి యొక్క మార్కుల వివరాలను https://cse.ap.gov.in/DSE/ వెబ్‌‌సై‌ట్‌ లో చూసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలకు 4,07,329 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

అభ్యర్థులు వారి దరఖాస్తులో పొందుపరిచిన కేటగిరి వివరాలు, 2021, మార్చి 17న జారీచేసిన జీవో నెం.23 ప్రకారం అనగా ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెఛ్సీ, ఎక్స్-సర్వీస్ మెన్ అర్హత పరీక్ష మార్కుల ప్రకారము, మరియు నార్మలైజేషన్ పద్ధతి అమలుచేసిన తర్వాత మొత్తం 58.07 శాతం మంది టెట్ లో అర్హత సాధించారని పేర్కొన్నారు. అభ్యర్థులు తాము సాధించిన మార్కుల వివరాలను సెప్టెంబర్ 30 నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =