గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2022లో 40వ స్థానంలో నిలిచిన భారత్

India Climbs to the 40th Rank in the Global Innovation Index-2022 of WIPO, Global Innovation Index 2022, India Climbs To 40th rank, India Climbs To 40Th Rank In Global Innovation Index, Mango News, Mango News Telugu, India climbs to 40th Rank, WIPO's Global Innovation Index, India's Rank Up in Global Innovation Index, Global Innovation Index 2022 UPSC, India Innovation Index, World Intellectual Property Organization, Global Innovation Index Live Updates, Global Innovation Index Latest News

వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీఓ) సంస్థ గురువారం గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్ (జీఐఐ)-2022 జాబితాను విడుదల చేసింది. జీఐఐ ఇండెక్స్-2022లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. జీఐఐలో 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ 2022లో 40వ స్థానానికి చేరుకుందని కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇక చివరిసారి ర్యాంకింగ్‌లో 46వ స్థానంలో ఉన్నామని, ఐసీటీ సేవల ఎగుమతులలో కూడా భారత్ 1వ ర్యాంక్‌ను సంవత్సరాలుగా కొనసాగించిందని పీయూష్ గోయల్ తెలిపారు.

జీఐఐ ఇండెక్స్-2022 లాంఛ్ సందర్భంగా పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు విధానాలు మరియు వాటి ప్రభావాన్ని ప్రతిబింబించేలా జీఐఐ ఒక సాధనంగా తనను తాను స్థాపించుకున్నదని అన్నారు. ప్రభుత్వం మరియు పరిశ్రమ చేతులు కలిపిన ప్రగతిశీల చర్యల కారణంగా జీఐఐ సంవత్సరాలుగా భారతదేశం యొక్క నిరంతర వృద్ధిని గుర్తించిందని తెలిపారు. 1.3 బిలియన్ల భారతీయుల తరపునడబ్ల్యూఐపీఓ సంస్థకు కృతజ్ఞతలు కేంద్రమంత్రి తెలిపారు. అలాగే జీఐఐ ఇండెక్స్‌లో టాప్ 25లోకి భారత్ ర్యాంకింగ్‌ను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇక జీఐఐ ఇండెక్స్-2022లో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అమెరికా, స్వీడన్, యూకే, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సింగపూర్, జర్మనీ, ఫిన్లాండ్, డెన్మార్క్, చైనా, ఫ్రాన్స్, జపాన్, హాంకాంగ్, చైనా ఎస్ఏఆర్, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రియా వంటి దేశాలు ఉన్నాయి

మరోవైపు జీఐఐ ఇండెక్స్-2022 లో భారత్ 40వ స్థానంలో నిలవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, “ఇన్నోవేషన్ అనేది భారతదేశం అంతటా సంచలనం. మన ఇన్నోవేటర్స్ పట్ల గర్వంగా ఉంది. మనం చాలా దూరం వచ్చాము మరియు ఇంకా కొత్త ఎత్తులను చేరుకోవాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =