ఎన్డీఏ గెలుపుపై అంత న‌మ్మ‌క‌మా?

Election of Parliament , BJP ,Lok Sabha elections,Prime Minister Modi,assembly elections,parliament elections,rahul gandhi,Indian Prime Minister Narendra Modi,Indian PM Narendra Modi,Narendra Modi,PM Narendra Modi, Narendra modi Latest News and Updates,Latest political updates,Mango News Telugu,Mango News
Election of Parliament , BJP ,Lok Sabha elections,Prime Minister Modi,

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆ పార్టీ శ్రేణులు చాలా ధీమాగా ఉన్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీ స‌హా ప్ర‌ముఖ నేత‌లు చాలా సంద‌ర్భాల్లో మాట్లాడుతూ.. ఎన్డీఏ 400 స్థానాల‌కు పైగా గెలుస్తుంద‌ని, సొంతంగానే బీజేపీ 370 సీట్లు సాధిస్తుంద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా మూడోసారి అధికారంలోకి వ‌చ్చాక ఏం చేయాలి అనే దానిపై ఇప్ప‌టినుంచే చ‌ర్చ‌లూ సాగిస్తుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓవైపు కాంగ్రెస్ పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంటే.. మ‌రోవైపు  ఆ పార్టీకి క‌నీసం 40 సీట్లు రావాల‌ని కోరుకుంటున్నా అంటూ మోదీ సెటైర్లు వేస్తున్నారు. కానీ.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ మాత్రం జోడో యాత్ర‌, న్యాయ య‌త్ర అంటూ .. దేశ‌మంతా తిరుగుతూనే ఉన్నారు. ఆశించిన ఆద‌ర‌ణ క‌నిపించ‌డం లేదు. ఈక్ర‌మంలోనే ఎన్డీఏ మ‌ళ్లీ వ‌స్తే ఏం చేయాలి అనే దానిపై స‌మావేశాలూ నిర్వ‌హించేస్తోంది…

వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్న నమ్మకంతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కొత్త సర్కారు ఏర్పడిన వెంటనే చేపట్టాల్సిన కార్యాచరణపై తాజాగా మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించారు. మోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి.. వచ్చే రెండు దశాబ్దాలకు సంబంధించిన వికసిత్‌ భారత్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌పై, వచ్చే ఐదేళ్లకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై రోజంతా మేధోమథనం జరిపింది. ఈ మేరకు వీటి తక్షణ అమలు కోసం.. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మే నెలలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే 100 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపైనా చర్చించారు. కొత్త ప్రభుత్వం చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన ప్రణాళికలతో రావాలని భేటీకి ముందు మంత్రులను ప్రధాని ఆదేశించారు. దీంతో పలువురు మంత్రులు, కార్యదర్శులు తమ ఆలోచనలను సమావేశంలో పంచుకున్నారు. వివిధ అంశాలపై ప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం జూన్‌ నెలలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ ద్వారా వికసిత్‌ భారత్‌ దిశగా అడుగులు వేయాలని, బడ్జెట్‌లో అది ప్రతిఫలించాలని పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌పై సమగ్ర చర్చలు నిర్వహించాలని సీఐఐ, ఫిక్కీ తదితర వాణిజ్యసంఘాలను కోరాలని, అన్ని మంత్రిత్వశాఖలకు సంబంధించిన విభాగాల పరిధిలో సెమినార్లు నిర్వహించాలని, పలు వర్గాల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని చెప్పారు. ఆవిష్కరణల రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేలా భవిష్యత్‌ టెక్నాలజీలను అభివృద్ధి చేయటానికి వీలుగా బడ్జెట్‌లో రూ.ఒక లక్ష కోట్ల భారీ నిధులను కేటాయించే అంశంపై మోదీ మాట్లాడారు… ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ ప‌రిశీల‌కులు గెలుపుపై ఎన్డీఏకు అంత న‌మ్మ‌క‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే.. దేశంలోని రాజ‌కీయ ప‌రిస్థితులు ఇప్ప‌టికీ మోదీకే అనుకూలంగా ఉన్నాయ‌ని ప‌లుkవురు భావిస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ముంద‌స్తు స‌న్నాహకాలు చేసుకుంటున్నార‌ని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY