యూట్యూబ్‌లో చూసి కోళ్ల కొనుగోలు కోసం ఏపీకి వచ్చిన థాయిలాండ్‌ వాసి

A Thai Man Came AP To Buy Roosters After Seeing Cockfight on YouTube,A Thai Man Came AP,Man Came AP To Buy Roosters,After Seeing Cockfight on YouTube,A Thai Man Came AP To Buy Roosters,Mango News,Mango News Telugu,Thai man came to AP, buy chickens after seeing them on YouTube,Eluru in AP, chicken that won prize money,AP fighter rooster sold to Thais,Thai Man Came AP Latest News,Thai Man Came AP Latest Updates,Thai Man Came AP Live News,Cockfight on YouTube,Man Came AP To Buy Roosters News,Man Came AP To Buy Roosters Latest News,Man Came AP To Buy Roosters Live Updates

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఏపీ వాసుల్లో వచ్చే ఆనందమే వేరు. రకరకాల పిండి వంటలు, కోడి పందేలు, అల్లుళ్ల రాక, భోగి మంటలు, ఆట పాటలు.. అబ్బో ఒక్కటేమిటి సవాలక్ష సంబరాలతో పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఏపీలో జరిగే ఈ సంబురాల వీడియోలు చూడడం అంటే చాలా మందికి ఇష్టం. నెట్టింట ఏపీ సంక్రాంతి సంబురాలకు సంబంధించిన ఇలాంటి వీడియోలు ఎన్నో ఉంటాయి.

అయితే ఇలా వీడియోలు చూసిన కొంత మంది థాయ్‌లాండ్ వాసులు.. తాజాగా ఏపీలోని ఏలూరుకు వచ్చారు. ముఖ్యంగా కోడి పందాలాకు సంబంధించిన వీడియోలను చూసి వాటిని కొనుగోలు చేయాలనుకున్నారు. అక్కడి ప్రజలను అడిగి మరి పందెం కోడిపిల్లను.. అత్యధిక ధరకు కొనుగోలు చేశారు. 3 లక్షల రూపాయలు ఇచ్చి పందెంకోడి పిల్లను తమ వెంట తీసుకెళ్లారు.

ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరిలోని గణపవరంలో జరిగిన కోడి పందాల్లో ఓ పందెం కోడి రూ.27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. థాయ్ రూస్టర్ ప్రేమికులు ఫేస్‌బుక్‌లో కోడి పందాలను చూసి దానిని సొంతం చేసుకోవాలని అనుకున్నారు. ఆ కోడి యజమాని రత్తయ్యను ఆ కోడిని అమ్మాలని కోరారు. కోడి కోసం వారు 3 రోజుల పాటు అతనిని వేడుకున్నా, రత్తయ్య దాన్ని అమ్మేందుకు ఒప్పుకోలేదు. చివరకు తమ దేశంలో జాతిని అభివృద్ధి చేసేందుకు మరో కోడిని ఎంపిక చేసి రూ.3 లక్షలకు కొనుగోలు చేశారు.

27 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న కోడి కోసం థాయ్‌గ్రూప్ తనను ఎంతగానో బతిమాలినట్లు రత్తయ్య చెప్పారు. కానీ తనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టిన ఆ కోడిని ప్రాణం పోయినా అమ్మనని అంటున్నారు. అలాగే వియత్నాం, మెక్సికో, కెనడా, యూఎస్‌ఏ, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు చెందిన వారు కోళ్ల కొనుగోలు కోసం ఫేస్‌బుక్‌ ద్వారా తరచూ సంప్రదిస్తున్నారని చెప్పారు. ఇటీవల వియత్నాంకు చెందిన ఓ సమూహం ఆయన దగ్గర నుంచి మొత్తం 40 పందెం కోళ్లను కొనుగోలు చేసింది. 40 ఎకరాల భూమిలో దాదాపు 500 పందెం కోళ్లను రత్తయ్య పెంచుతున్నట్లు వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + five =