ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే

Alla Ramakrishna Reddy Comments On Chandrababu House,Mango News,Alla Ramakrishna Reddy Satirical Suggestion To Chandrababu Naidu,Alla Ramakrishna Reddy Questions about Chandrababu House,N Chandrababu Naidu Must Vacate Residence - Alla Ramakrishna Reddy,TDp Chief Nara Chandrababu Naidu should vacate house - MLA Alla Ramakrishna Reddy

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి చంద్రబాబు ఇంటి పై తన గళం వినిపించారు. సిఆర్డీఏ అధికారుల నోటీసులపై ఇప్పటికైనా స్పందించాలని, అక్రమంగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నందుకు బాధ్యత వహించి, వెంటనే ఖాళీ చేయాలనీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ, తను నివాసముండే ఇంటి పై, యజమాని అయినా లింగమనేని రమేష్ తో పొంతన లేని విధంగా రోజుకొకసారి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ఈ విషయం పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్ ని కోరినట్టు తెలియజేశారు.

ఈ సందర్బంగా, ఈ ఇంటిపై గతంలో చంద్రబాబు మరియు లింగమనేని రమేష్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రదర్శించారు, లింగమనేని రమేష్ ఆ ఇంటికి సంబందించిన అన్ని వివరాలను ఒకేసారి స్పష్టం చేయాలనీ కోరారు. సిఆర్డీఏ పరిధి లోని అన్ని అక్రమ కట్టడాలను గుర్తించి, నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కరకట్టలపై నిర్మాణాలకు రాజశేఖరరెడ్డి హయాంలో ఉన్న ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే నిరూపించాలని, తప్పుగా అనుమతులు ఇచ్చిన అధికారుల పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + sixteen =