ఢిల్లీ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని సమావేశానికి ఆహ్వానం నేపథ్యంలో!

TDP Chief Chandrababu To Attend Azadi Ka Amrit Mahotsav National Committee Meeting by PM Modi in Delhi Today, Chandrababu To Attend Azadi Ka Amrit Mahotsav National Committee Meeting by PM Modi in Delhi Today, TDP Chief To Attend Azadi Ka Amrit Mahotsav National Committee Meeting by PM Modi in Delhi Today, Nara Chandrababu Naidu To Attend Azadi Ka Amrit Mahotsav National Committee Meeting by PM Modi in Delhi Today, Azadi Ka Amrit Mahotsav National Committee Meeting by PM Modi in Delhi Today, PM Modi Azadi Ka Amrit Mahotsav National Committee Meeting in Delhi, Azadi Ka Amrit Mahotsav National Committee Meeting, National Committee Meeting, Nara Chandrababu Naidu, TDP President, TDP Chief, Chandrababu Naidu Delhi Visit, Nara Chandrababu Naidu Delhi Tour, Azadi Ka Amrit Mahotsav National Committee Meeting News, Azadi Ka Amrit Mahotsav National Committee Meeting Latest News, Azadi Ka Amrit Mahotsav National Committee Meeting Latest Updates, Azadi Ka Amrit Mahotsav National Committee Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఒక కీలక సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. కాగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా.. ఏడాది పాటు కార్యక్రమాలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో 75 ఏళ్ల స్వాతంత్య్ర సంస్మరణ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ సమావేశానికి చంద్రబాబు నాయుడును కేంద్రం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలో రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. అలాగే ఈ సమావేశంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా పలు కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో శనివారం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవనున్నారు. అలాగే నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని కూడా కలవనున్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత దేశ రాజధానిలో అధికారిక సమావేశానికి చంద్రబాబు నాయుడును కేంద్రం ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడాన్ని నిరసిస్తూ 2018లో బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) నుంచి టీడీపీ వైదొలిగిన విషయం విదితమే. ఇక 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్‌డౌన్ గుర్తుగా గత సంవత్సరం మార్చి 12న మహోత్సవ్ ప్రారంభమవగా 2023 ఆగస్టు 15తో ముగియనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =