ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు – ఏపీ ఆర్థిక శాఖ

Andhra Pradesh, Andhra Pradesh Finance Department, Andhra Pradesh Finance Department Confirms Salaries, Andhra Pradesh Finance Department Confirms Salaries Will Be Paid, Andhra Pradesh Finance Department Confirms Salaries Will Be Paid According To New PRC, Andhra Pradesh New PRC, Andhra Pradesh PRC, Andhra Pradesh PRC Issue, AP chief secretary assures employees, AP Employees PRC Issue, AP orders salary in new payscales, AP PRC Issue, Mango News, PRC Issue, PRC Issue in Ap, Salaries will be paid according to new PRC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 జనవరి వేతనాలు రివైజ్డ్ పేస్కేల్‌ ప్రకారంమే ఇస్తున్నామని.. ఉద్యోగులు, పెన్షనర్లు తమ పే స్లిప్‌లను ఆన్‌లైన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలియజేశారు. దాని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా ఉద్యోగులకు ఫోన్స్ కు వేతనానికి సంబంధించిన‌ ఎస్ఎంఎస్ సమాచారం వస్తుందని ఆర్థికశాఖ పేర్కొంది. కొత్త వేతన స్కేల్ ప్రకారం ఎవరికి ఎంత జీతం వస్తుందో.. ఎంత పెన్షన్ వస్తుందో ఖరారు చేసింది. ఈ వివరాలను ప్రతి ఒక్క ఉద్యోగి చూసుకోవచ్చని ఆర్ధిక శాఖ తెలిపింది.

అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కితీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసందే. ఈక్రమంలో.. కొత్త పీఆర్సీపై తమ నిరసన ప్రభుత్వానికి తెలియజేయటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందరూ రిలే దీక్షలు చేస్తున్నామని నేతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిపై మాట తప్పిందని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సానుకూలతతో వ్యవహరించడంలేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకునేదాకా నిరసనలు కొనసాగుతాయని కూడా ఉద్యోగులు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 11 =