ఏపీలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు హాల్​టికెట్లు విడుదల, డౌన్‌లోడ్‌ ప్రారంభం

Andhra Pradesh Hall Ticket Download Started for Today for Preliminary Written Test of Constable Posts,Ap Constable Apply Online 2023,Constable Notification 2023 Ap Last Date,Ap Constable Notification 2023,Apslprb,Mango News,Mango News Telugu,Ap Constable Age Limit 2022,Ap Police Si Notification 2022,Ap Police Constable Selection Process,Ap Constable Syllabus,Ap Constable Apply Online 2022,Constable Notification 2022 Ap Last Date,Ap Constable Notification 2023,Apslprb,Ap Constable Age Limit 2023,Ap Police Si Notification 2022,Ap Govt Constable Notification,Ap Constable Posts,Ap Constable Posts Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల‌కు సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జనవరి 22వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు నేటి నుంచే (జనవరి 12, గురువారం) హాల్‌టికెట్లు విడుదల చేస్తునట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్బీ) వెల్లడించింది. ముందుగా 6,100 పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్ (మెన్ అండ్ విమెన్): 3580 పోస్టులు, ఏపీఎస్పీ (మెన్): 2520 పోస్టులు) ఖాళీల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఏపీఎస్‌ఎల్‌పీఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం 2023, జనవరి 22 (ఆదివారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ రాత పరీక్షనిర్వహించనున్నారు.

దరఖాస్తులను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులందరూ https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం హాల్ టిక్కెట్‌ లను జనవరి 12 ఉదయం 10 గంటల నుండి జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =