ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్.. ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని వెల్లడి

Telangana Ex-CS Somesh Kumar Arrives in Vijayawada and Met AP CS Jawahar Reddy Today,Telangana Ex-CS Somesh Kumar,Met AP CS Jawahar Reddy Today,Ex-CS Somesh Kumar,AP CS Jawahar Reddy,Mango News,Mango News Telugu,Telangana Chief Secretary Somesh Kumar,Sri Somesh Kumar The Hon'Ble Chief Secretary,Somesh Kumar Wikipedia,Somesh Kumar Chief Secretary Telangana Wikipedia,Somesh Kumar Chief Secretary Address,Head Of Chief Secretary,Chief Secretary Telangana Office Address,Chief Secretary Or Principal Secretary

సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ గురువారం విజయవాడ చేరుకున్నారు. డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలు మేరకు ఏపీ కేడర్‌కు వచ్చిన ఆయన జాయినింగ్ రిపోర్ట్ కోసం సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. కాగా సోమేశ్ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్ వరకు పదవీకాలం ఉండటం, తెలంగాణ సీఎస్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయనకు ఏపీలో ఏ పోస్టింగ్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ కేడర్‌కు చెందిన సోమేశ్ కుమార్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కొనసాగుతూ వచ్చారు. మొదట జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఆయన ఆ తరువాత రాష్ట్ర సీఎస్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా సోమేష్ కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో కేంద్రం సోమేశ్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. నేడు ఏపీలో రిపోర్టింగ్ చేయడానికి ఆయన వచ్చారు.

ఇక అంతకుముందు సోమేశ్ కుమార్ విజయవాడ చేరుకున్న సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ చీఫ్ సెక్రటరీకి జాయినింగ్ రిపోర్టర్ ఇవ్వడానికి వచ్చానని, అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా క‌ల‌వ‌నున్నానని వెల్ల‌డించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చానని, ఏ బాధ్యతలు ఇచ్చినా ప‌ని చేయ‌డానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఒక ప్ర‌భుత్వ ఉద్యోగిగా డీఓపీటీ ఆదేశాలు పాటిస్తానని, హోదాతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. అలాగే వీఆర్ఎస్ గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని, తన కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుంటానని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here