3 రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

AP 3 Capitals Bill, AP 3 Capitals Bill Approved, AP Assembly, AP Assembly Approved 3 Capitals Bill, AP Assembly Approved Decentralisation Bill, Decentralisation Bill

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జూన్ 16, మంగళవారం ఉదయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసన సభ పలు కీలక బిల్లులకు ఈ రోజు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ(మూడు రాజధానుల ఏర్పాటు), సీఆర్డీఏ రద్దు బిల్లుతో పాటుగా 2020 ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. వీటితో పాటు పలు బిల్లులను ఆమోదించాక శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఈ రోజు ఏపీ శాసనసభ ఆమోదించిన బిల్లులు:

  • అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు
  • సీఆర్డీఏ రద్దు బిల్లు
  • పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు
  • దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులు
  • స్థానిక సంస్థల ఎన్నికల సంస్కరణల బిల్లు
  • 2020 ఎక్సైజ్‌ సవరణ బిల్లు
  • జీఎస్టీ సవరణ బిల్లు
  • వ్యాట్ సవరణ బిల్లు
  • ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లు
  • ఉన్నత విద్యాకమిషన్ సవరణ బిల్లు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − seventeen =