త్వరలో 1180 పోస్టుల భర్తీ, ఏపీపీఎస్సీకి అనుమతులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government, AP Govt Permits APPSC to Issue Notification, AP Govt Permits APPSC to Issue Notification For 1180 Vacant Posts, ap job notifications, ap job notifications 2021, AP Jobs Direct Recruitment, AP Jobs Recruitment, APPSC to Issue Notification For 1180 Vacant Posts, Form expert panel on Mekedatu, Govt Permits APPSC to notify 1180 vacant posts, Mango News, Notification For 1180 Vacant Posts

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1180 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముందుగా ఈ పోస్టుల భర్తీకై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అనుమతులు ఇస్తూ గురువారం నాడు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ పోస్టుల భర్తీలో ఈబీసీలకు (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

మొత్తం 15 విభాగాల్లో 1180 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వగా, ఎక్కువుగా రెవెన్యూ శాఖలో జూ.అసిస్టెంట్/కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 670 భర్తీ కానున్నాయి. అసిస్టెంట్‌ ఇంజినీర్లు 190, మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేద) 72, దేవదాయశాఖలో గ్రేడ్‌–3 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ 60, మెడికల్‌ ఆఫీసర్‌(హోమియోపతి) 53, హార్టికల్చర్‌ ఆఫీసర్స్ 39, మెడికల్‌ ఆఫీసర్‌(యునాని) 26, లెక్చరర్‌ (హోమియో) 24 పోస్టులు సహా వివిధ కేటగిరీల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − five =