ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…

75 Percent Attendance Made Mandatory for Ammavodi Scheme, Ammavodi Scheme, Andhra government, Andhra Pradesh cabinet meeting, Andhra Pradesh cabinet meeting News, AP Cabinet Key Decisions, AP Cabinet Meet, AP Cabinet Meet Key Decisions, AP Cabinet Meeting, AP CM YS Jagan Mohan reddy, Chief Minister of Andhra Pradesh, Mango News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 28, గురువారం నాడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు:

  • నవంబర్‌ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ.
  • ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాల పోర్టల్ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆర్డినెన్స్‌ ఆమోదం.
  • అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ నిర్ణయం.
  • బీసీ జనగణనను కులాల వారీగా చేసేలా అసెంబ్లీలో తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం.
  • శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాల కేటాయింపుకు ఆమోదం.
  • వైద్య, విద్య, కుటుంబ సంక్షేమశాఖలో ఉద్యోగాల భర్తీ. కొత్తగా 4,035 కొత్త ఉద్యోగాలకు ఆమోదం.
  • రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ ఇచ్చేలా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం.
  • కొత్తగా జైన్‌ మరియు సిక్కుల కార్పొరేషన్ల ఏర్పాటుకు నిర్ణయం.
  • అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు.
  • ప్రకాశం జిల్లాలో జేఎన్‌టీయూ, గురజాడ వర్సిటీలకు ఆమోదం.
  • అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు.
  • పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి ఆమోదం.
  • జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్‌కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపు.
  • రాష్ట్రవ్యాప్తంగా 5చోట్ల సెవన్‌ స్టార్‌ పర్యాటక రిసార్ట్‌ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపుకు ఆమోదం.
  • మావోయిస్టులు, అనుబంధ సంస్థలపై నిషేధం మరోఏడాది పొడిగింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 12 =