ఏపీలో గ్రీన్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్.. తిరుమలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం

AP Central Govt Selects Tirumala For Green Energy Pilot Project, Central Govt Selects Tirumala For Green Energy Pilot Project, Green Energy Pilot Project, Central Govt, Central Govt selects Tirumala for green energy pilot project, Tirumala as a pilot project for alternative power generation, alternative power generation, Tirumala as a pilot project, Central Govt selects Andhra Pradesh's Tirumala for green energy pilot project, Tirumala has been selected as a pilot project for alternative power generation, Bureau of Energy Efficiency, Green Energy Pilot Project News, Green Energy Pilot Project Latest News, Green Energy Pilot Project Latest Updates, Green Energy Pilot Project Live Updates, Bureau of energy efficiency chooses Tirumala for green energy pilot project, Tirumala, Mango News, Mango News Telugu,

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పర్యావరణ పరిరక్షణ‌కు గుర్తింపుగా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో పైలట్ గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రతినిధులు తెలిపారు. ప్రత్యామ్నాయ విద్యుదుత్పత్తి కోసం తిరుమలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, పట్టణంలోని అవకాశాలపై అధ్యయనం చేసేందుకు త్వరలో నిపుణుల బృందాన్ని పంపుతామని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ శుక్రవారం తెలిపింది. దేశంలో ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, దానిలో భాగంగానే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన పచ్చని అడవులతో, జలపాతాలతో అలరారే తిరుమలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు.

అలాగే తిరుమలలో గ్రీన్ పవర్ ఉత్పత్తి అవకాశాలపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే ఒక నిపుణుల బృందాన్ని పంపనున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డైరెక్టర్ జనరల్ అభయ్ బక్రేతో టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం తయారీకి సోలార్‌ విద్యుత్‌ వినియోగం, కాకులకొండలో పవన విద్యుత్‌ ఉత్పత్తిపై టీటీడీ అధికారులు బీఈఈ ప్రతినిధులకు వివరించారు. టీటీడీ ప్రతిపాదనలను అనుసరించి విజిటింగ్‌ నిపుణుల కమిటీని సంప్రదిస్తామని బీఈఈ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా టిటిడికి అన్ని రకాల ఆర్థిక, సాంకేతిక మరియు అటవీ మద్దతుకు సంబంధించిన విషయాలలో బీఈఈ సహకరించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + one =