గుజరాత్‌లో 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

PM Modi Unveils 108-ft Statue of Lord Hanuman at Morbi Gujarat Today, Modi unveils 108 ft Lord Hanuman statue in Gujarat`s Morbi, Pm Modi Unveils A 108 Ft Statue Of Lord Hanuman Statue In Morbi, Modi unveils 108-ft tall Lord Hanuman statue, Lord Hanuman statue, 108-ft tall Lord Hanuman statue, Prime Minister Narendra Modi on Saturday unveiled a 108 ft statue of Lord Hanuman in Gujarats Morbi, Prime Minister Narendra Modi unveiled a 108-feet statue of Lord Hanuman in Morbi district, PM Narendra Modi unveils 108 Ft Statue Of Lord Hanuman Statue, Lord Hanuman Statue News, Lord Hanuman Statue Latest News, Lord Hanuman Statue Latest Updates, Lord Hanuman Statue Live Updates, Hanuman Jayanti, Prime Minister Narendra Modi unveiled a 108 Ft Statue Of Lord Hanuman Statue in Morbi, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Narendra Modi, Prime Minister Narendra Modi, Mango News, Mango News Telugu,

గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. దేశ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు మోదీ. శనివారం గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకారం “హనుమాన్ జీ 4 ధామ్” ప్రాజెక్ట్‌లో భాగంగా భారతదేశం అంతటా నాలుగు దిశలలో ఏర్పాటు చేయబడుతున్న నాలుగు విగ్రహాలలో ఈ విగ్రహం రెండవది. రామాయణ గాధ ప్రకారం.. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చే క్రమంలో ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడని స్థల పురాణం. అందుకే ఈ ప్రాజెక్టులో భాగంగా పశ్చిమాన మోర్బీలోని పరమ పూజ్య బాపు కేశ్వానంద్ జీ ఆశ్రమంలో గుజరాత్ విగ్రహాన్ని పశ్చిమాన ఏర్పాటు చేశారు.

“హనుమాన్ జీ తన భక్తితో, తన సేవ ద్వారా ప్రతి ఒక్కరినీ కలుపుతాడు. ప్రతి ఒక్కరూ హనుమాన్ జీ నుండి స్ఫూర్తిని పొందుతారు. హనుమంతుడు అన్ని అటవీ జాతులకు మరియు అటవీ సోదరులకు గౌరవించే హక్కును అందించిన శక్తి. కాబట్టి మన సంప్రదాయంలో హనుమాన్ జీ ఒక ముఖ్యమైన భాగం. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్” అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. “హనుమాన్ జీ 4 ధామ్” ప్రాజెక్ట్‌లో భాగమైన మొదటి విగ్రహాన్ని 2010వ సంవత్సరంలో ఉత్తర భారతదేశం లోని సిమ్లాలో ఏర్పాటు చేశారు. అమితాబ్ బచ్చన్ అల్లుడు నందా నేతృత్వంలో ఇది నిర్మితమైంది. దీని తదనంతర మూడవ విగ్రహం యొక్క నిర్మాణం దక్షిణాన రామేశ్వరంలో ఇప్పటికే ప్రారంభించబడింది. అలాగే తూర్పు దిక్కున ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలో 4గవ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + two =