గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు వీడ్కోలు పలికిన సీఎం జగన్‌

AP CM YS Jagan Farewells Governor Biswabhusan Harichandan at Gannavaram Airport Today,Governor Biswabhusan Harichandan at Vijayawada Today,CM YS Jagan Congratulates,Biswabhusan Harichandan, who has been Appointed,Governor of Chhattisgarh,Mango News,Mango News Telugu,TDP chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates,Andhra Pradesh Politics,Andhra Pradesh Political News,Andhra Pradesh,Chandrababu Naidu News and Updates,YSR Congress Party

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ మేరకు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం వద్దకు చేరుకొని గవర్నర్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో గవర్నర్‌ను ఆలింగనం చేసుకున్న సీఎం జగన్ పుష్ప గుచ్ఛం అందించి వీడ్కోలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కే రాజేంద్రనాథ్‌ రెడ్డి, గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చత్తీ‌స్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆయనకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్‌కు రాష్ట్రం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఒక కుటుంబ పెద్దలాగా బిశ్వభూషణ్‌ వ్యవహరించారని, గవర్నర్‌ వ్యవస్థకు ఆయన నిండుతనం తెచ్చారని కొనియాడారు. ఇక దీనికి గవర్నర్ స్పందిస్తూ.. సీఎం జగన్ తనపై చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేనని, రాష్ట్రాన్ని వీడుతున్నందుకు ఎంతోబాధగా ఉన్నప్పటికీ కేంద్రం తనకు మరో బాధ్యత అప్పగించినందున వెళ్ళక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. ఇక బిశ్వభూషణ్ బదిలీ అయిన నేపథ్యంలో నేడు ఏపీకి కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ రానున్నారు. ఈరోజు రాత్రి 7:30 గంటలకు జస్టిస్ నజీర్‌ గన్నవరం చేరుకోనున్నారు. ఈ క్రమంలో కొత్త గవర్నర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. కాగా ఈనెల 24న ఏపీ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here