రేపే ‘జగనన్న చేదోడు’ ప్రారంభం, వారి ఖాతాల్లోకి నేరుగా రూ.10 వేలు జమ

AP CM YS Jagan, AP Govt Jagananna Chedodu Programme, AP Jagananna Chedodu Scheme 2020, Jagananna Chedodu, Jagananna Chedodu Programme, Jagananna Chedodu Scheme, Jagananna Chedodu Scheme In AP, YS Jagan To Launch Jagananna Chedodu Programme

కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా కొనసాగిస్తున్నారు. ఇటీవలే వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమచేయగా, ఆ తర్వాత వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించారు. ఇక రేపే (జూన్ 10, బుధవారం) ‘జగనన్న చేదోడు’ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించనున్నారు.

నాయీ బ్రహ్మణులకు, రజకులకు, టైలర్లకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ‘జగనన్న చేదోడు’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ రేపు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ ఏడాది రూ.10వేల చొప్పున ఐదేళ్లపాటు వారికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే జమచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రహ్మణులకు, టైలర్లకు, రజకులకు ఈ పథకాన్ని అమలుచేయనున్నారు. లబ్దిదారుల ఎంపిక పూర్తవగా, సుమారు 2,47,040 మంది అర్హత సాధించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జగనన్న చేదోడు పథకానికి రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం జూన్ 9 , మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =