రికార్డు స్థాయిలో ఒక్క రోజే 1685 కరోనా పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదు

Coronavirus in Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu Corona Cases, Tamil Nadu Corona Deaths, Tamil Nadu Corona Positive Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu Coronavirus Cases, Tamil Nadu Coronavirus News, Tamil Nadu Coronavirus Updates, Tamil Nadu Covid-19 Cases, Tamil Nadu Reports 1562 New Covid-19 Cases

తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1685 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ రోజు 1247 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,914 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 24545 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన 21 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 307 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 798 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18325 కి చేరింది. ప్రస్తుతం 16,282 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 11 =