ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 275 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 50, విదేశాల నుంచి వచ్చిన వారు 26 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 275 కేసులతో కలిపి జూన్ 17, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5555 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 15188 సాంపిల్స్ ని పరీక్షించగా 275 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే కోవిడ్ వలన కొత్తగా కర్నూల్ లో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించగా, ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 90 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2906 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 55 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 2559 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 1253 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 562 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 263 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 219 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 1440 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 7071 కి చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu