మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకు, మొదటి పది రోజుల పాటు టికెట్ రేట్ల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Govt Approves To Hike of Ticket Rates Upto First Ten Days For Megastar Chiranjeevi Acharya Movie, Hike of Ticket Rates Upto First Ten Days For Megastar Chiranjeevi Acharya Movie, Megastar Chiranjeevi Acharya Movie, Actor Megastar Chiranjeevi Acharya Movie, Hero Megastar Chiranjeevi Acharya Movie, Chiranjeevi Acharya Movie, Megastar Chiranjeevi, Acharya Movie, Acharya Movie News, Acharya Movie Latest News, Acharya Movie Latest Updates, Acharya Movie Live Updates, Megastar Chiranjeevi Acharya Movie Ticket Rates Hiked Upto First Ten Days, Acharya Movie Ticket Rates Hiked Upto First Ten Days, Mango News, Mango News Telugu,

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమాకు మొదటి పది రోజుల వరకు టిక్కెట్ ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు ఏపీ సర్కార్ ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో ప్రకారం.. మొదటి పది రోజులకు రూ. 50/- వరకు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. నిర్మాణంలో రూ. 100 కోట్ల బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే విషయంలో గతంలోనే ఆమోదం తెలిపింది. అయితే కీలకమైన 5వ షో విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆయన తనయుడు, టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

మరోవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఆచార్య’ సినిమాకి వారం రోజుల పాటు టిక్కెట్ పెంపుతో పాటు ఐదు షోలకు అనుమతిని మంజూరు చేయడం ద్వారా శుభవార్త అందించింది. తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో ప్రకారం.. మొదటి వారం రోజుల పాటు మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50/-, ఏసీ థియేటర్లలో రూ. 30/- వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. దీంతో మల్టీప్లెక్స్‌లు, పెద్ద స్క్రీన్‌లు మరియు సింగిల్ థియేటర్‌లు టిక్కెట్ ధరలను సుమారుగా 350/- లుగా నిర్ధారించారు. అలాగే ఎయిర్ కండిషన్డ్/ఎయిర్ కూల్డ్ కేటగిరీ థియేటర్‌లు ధరలను పెంచి, టిక్కెట్ ధరలను దాదాపు 220/- లకు విక్రయించనున్నారు. అయితే నాన్-ఏసీ కేటగిరీలలో ఎటువంటి మార్పు లేదు. ఇది కాకుండా, విడుదలైన రోజు నుండి ఒక వారం పాటు ఈ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఐదవ ప్రదర్శన కొరకు అనుమతినిచ్చింది. ఈ జీవో ఒక వారం పాటు, 5 మే 2022 వరకు కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 7 =