భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత: జూన్ 19 న పీఎం మోదీ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

3 Indian Soldiers Killed, 3 Indian Soldiers Killed at Border Clash, China kills three Indian soldiers, China kills three Indian soldiers in border clash, India-China Border, India-China Border Tensions, India-China border tensions LIVE Updates,India-China Border Tensions, PM Modi has Called for an All-party Meeting on 19th June,PM Modi All-party Meeting

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15/16 న తీవ్ర ఘర్షణ జరిగింది. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటన అనంతరం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత-చైనా సరిహద్దు ప్రాంతాల పరిస్థితులపై చర్చించడానికి, ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 19, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం బుధవారం నాడు ట్వీట్‌ చేసింది.

మరోవైపు గాల్వన్‌ లోయ సమీపంలో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది భారత జవాన్లకు యావత్ ‌ దేశం నివాళులర్పిస్తోంది. దేశవ్యాప్తంగా రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, ప్రజలు అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నారు. మన సరిహద్దులను రక్షిస్తూ, మన గౌరవాన్ని కాపాడుతూ దేశంకోసం వీరమరణం పొందిన అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =