ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

AP EAMCET 2019 Counselling out, AP EAMCET Counselling 2019 Schedule Certificate Verification, AP EAMCET Counselling Dates 2019 Rank Wise Released, AP Eamcet Counselling Schedule Released, AP EAMCET Important Dates 2019 Announced, Counselling Schedule days out for AP Eamcet, Mango News

ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఎదురుచుపులకు తెరపడింది. ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిలింగ్ తేదీలను ప్రకటించింది. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రేపటి నుండి కళాశాలలు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. ర్యాంకుల ప్రకారం వెబ్ ఆప్షన్స్ ఎంపికకు తేదీలను వెల్లడించారు.

1 వ ర్యాంకు నుంచి 35 వేల ర్యాంకు వరకు జూలై 27, 28 వ తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. 35 వేల ర్యాంకు నుండి 80 వేల ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్స్ ఎంపికకు జూలై 29, 30 వ తేదీలు కేటాయించారు. 80 వేల ర్యాంకు మొదలుకొని చివరి ర్యాంకు వరకు జూలై 31, ఆగస్ట్ 1 న ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఒకసారి ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ మార్చుకునేందుకు ఆగస్ట్ 2న వీలు కల్పించింది. ఆప్షన్స్ పక్రియ పూర్తి అయిన తరువాత ఆగస్ట్ 4న సీట్లు కేటాయించనున్నారు. అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో గత ఏడాది నిర్ణయించిన ఫీజులే వర్తిస్తాయనీ అధికారులు ధృవీకరించారు. ఆగస్ట్ 5 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి, సీటు పొందిన విద్యార్థులు, కాలేజ్ లో రిపోర్ట్ చేసేందుకు ఆగస్ట్ 8ని చివరి తేదీగా నిర్ణయించారు.

 

[subscribe]
[youtube_video videoid=00LsFMuEPYA]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + three =