ఉపాధ్యాయుల ఖాళీలపై రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Govt Schools Vacancies Reports Asked By Supreme Court, Mango News, Supreme Court About Govt Schools Vacancies, Supreme Court Asks Report Of Vacancies In Govt Schools Of Two Telugu States, Supreme Court Hears Teacher Posts Vacancies in Govt Schools, Supreme Court Shock To Telugu State, Telugu States Govt Schools Vacancies Reports

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ఈ రోజు సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఖాళీల నివేదికను మూడు రోజుల్లో గనుక అందజేయలేకపోతే రెండు రాష్ట్రాల ఛీప్ సెక్రటరీలు న్యాయస్థానం ముందు హాజరు అవ్వాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతుల కల్పన, ఉపాధ్యాయ నియామకాలపై దాఖలైన పిటిషన్ పై ఈ రోజు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇంతకూ మునుపే ఒకసారి నివేదిక ఇవ్వాలని కోర్టు రెండు రాష్ట్రాలను కోరగా, వరుసగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన ప్రభుత్వాల తరపు నుంచి వాయిదా కోరాయి. మళ్ళీ ఈ రోజు విచారణ చేపట్టిన అనంతరం,మూడు రోజుల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

 

[subscribe]
[youtube_video videoid=luKhECNc_D0]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =