టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

AP Ex Minister Kodali Nani Sensational Comments on TDP Chief Chandrababu Naidu, Kodali Nani Sensational Comments on TDP Chief Chandrababu Naidu, Sensational Comments on TDP Chief Chandrababu Naidu, TDP Chief Chandrababu Naidu, AP Ex Minister Kodali Nani, Sensational Comments, Ex Minister Kodali Nani News, Ex Minister Kodali Nani Latest News And Updates, Ex Minister Kodali Nani Live Updates, Mango News, Mango News Telugu,

మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గుడివాడ క్యాంపు ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మార్ఫింగ్ వీడియోను టీడీపీ ప్రచారంలోకి తెచ్చిందని అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఎంపీ గోరంట్ల ఒరిజినల్ వీడియో బయటపెట్టాలని సవాల్ చేశారు.

వైసీపీ తలకు టీడీపీ బాడీతో ఎడిటింగ్ చేసిన వీడియోను రికార్డు చేసి, దాన్ని అమెరికాలోని ల్యాబ్‌కు పంపి ఏదో రిపోర్ట్ వచ్చిందని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టించడానికి టీడీపీ ఆధ్వర్యంలోనే ఎంపీ మాధవ్ వీడియోను ఎడిట్ చేశారని విమర్శించారు. పోలీసులు అది ఫేక్‌ వీడియో అని చెప్పినా టీడీపీ నేతలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి రావడానికి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని, స్త్రీలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటేనని కొడాలి నాని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 5 =