తెలంగాణ గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రామ్ చందర్ నాయక్

Eslavath Ramchander Naik Takes Charge As Chairman of Telangana State Southern Power Distribution, Eslavath Ramchander Naik Takes Charge As Chairman of TSSTCFDCL, Chairman of TSSTCFDCL, Telangana State Southern Power Distribution, Eslavath Ramchander Naik, TSSTCFDCL Chairman, TSSTCFDCL, Eslavath Ramchander Naik News, Eslavath Ramchander Naik Latest News And Updates, Eslavath Ramchander Naik Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ (టీఎస్ఎస్టీసీఎఫ్డీసీఎల్) చైర్మన్ గా నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించగా, ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం టీఎస్ఎస్టీసీఎఫ్డీసీఎల్/ట్రైకార్ చైర్మన్ గా ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా రాష్ట్రమంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గిరిజన అభివృద్ధి కోసం వివిధ వినూత్న పథకాలు ప్రవేశపెట్టారని, ప్రతి గిరిజన గ్రామానికి త్రీ ఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించారని, అదే విధంగా గిరిజనులు అన్నీ రంగాలలో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వoలో రాష్ట్రంలో గిరిజన, దళిత మరియు మైనారిటీల అభివృద్ధికి, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమల ద్వారా సమగ్ర అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఛైర్మన్ గా పదవి స్వీకరించిన ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ ను అభినందించారు. అనంతరం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మరియు నియోజక వర్గ కార్యకర్తలకు ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

అలాగే గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్త్, రాజ్యసభ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, రవీంద్ర కుమార్, ఎన్.భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య, సైదిరెడ్డి, భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిశోర్, ట్రైకార్ జనరల్ మేనేజర్ శంకర్ రావు, ట్రైకార్ అదనపు సంచలకులు సర్వేశ్వర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =