టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా మంగళవారం ఉదయం హైదరాబాద్ కేపిహెఛ్బీ లోని నారాయణ నివాసానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆయనను ఏపీకి తరలిస్తున్నారు. అయితే ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే విషయంపై చిత్తూరు పోలీసులు కాసేపట్లో ప్రకటన చేసే అవకాశముంది. ఇటీవల ఏపీలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలోనే మాజీ మంత్రి నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. కాగా ఈ అరెస్ట్ వ్యవహారంపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ