ఏపీలో కొత్త ఎస్ఈసీ నియామకంపై ప్రారంభమైన కసరత్తు?

Andhra Pradesh, AP Exercise to Appoint New Election Commissioner, AP Government, AP Government Starts Exercise to Appoint New Election Commissioner, AP govt. starts exercise to appoint new SEC, AP New Election Commissioner, AP SEC, AP SEC Change, AP SEC Change News, Election Commissioner, Mango News, New Election Commissioner For Andhra Pradesh, New Election Commissioner In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31వ తేదీతో ముగియ‌నున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ఏపీ ఎస్ఈసీ నియామకంపై కసరత్తు మొదలైంది. ఈ రాజ్యాంగబ‌ద్ద ప‌ద‌వి కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తుంది. ఏపీ మాజీ సీఎస్, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ నీలం సాహ్ని, మాజీ ఐఏఎస్ అధికారులు ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు పంపినట్టు సమాచారం. ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రామా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. కాగా జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొత్త ఎస్ఈసీ నియామక అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 12 =