తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ప్రారంభమైన నామినేషన్ల పక్రియ

Bandi Sanjay Kumar, Mango News, Nagarjuna Sagar, Nagarjuna Sagar Assembly By-election, Nagarjuna Sagar By Election Date, Nagarjuna Sagar By Election Date 2021, Nagarjuna Sagar By Poll, Nagarjuna Sagar By-election, Nagarjuna Sagar in Telangana, Nagarjuna Sagar Tirupati By-election, Nominations Process Starts From Today, Tirupati By Election, Tirupati By Election 2021, Tirupati By Election nominations

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక కోసం ఈ రోజున (మార్చి 23, మంగళవారం) ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచే నాగా‌ర్జు‌న‌సా‌గర్ అసెంబ్లీ స్థానం, తిరుపతి లోక్ సభ స్థానం ఉప‌ఎ‌న్నిక కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నాగా‌ర్జు‌న‌సా‌గర్ లో ఈ రోజు ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు.

ఈ రెండు చోట్ల మార్చి 30 వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన మార్చి 31 న జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరుతేదీగా ఏప్రిల్ 3 ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహించి, మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. నేటి నుంచే నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుండడంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఉపఎన్నికల సందడి మొదలుకానుంది. ఈ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =