రేపు దేశంలో 5G సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi to Launch 5G services on October 1st at Pragati Maidan New Delhi, Prime Minister Modi Launch 5G Services, 5G Services Launches In India , PM Modi Launching 5G Services, Mango News, Mango News Telugu, PM Narendra Modi To Launch 5G Services, India 5G Services, India 5G Network Launch , 5G Technology In India, PM Narendra Modi Launch 5G Services, India 5G Launching Services, India 5G Network, 5G Network, 5G Services In India, 5G Services Launch India, PM Narendra Modi, PM Narendra Modi Latest News And Updates

కొత్త సాంకేతిక శకానికి నాంది పలుకుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 1, శనివారం) ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 5G సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 5G టెక్నాలజీ సీమ్ లెస్ కవరేజ్, అధిక డేటా రేటు, తక్కువ జాప్యం మరియు అత్యంత విశ్వసనీయమైన కమ్యూనికేషన్‌లను అందిస్తుందని, ఇది ఎనర్జీ ఎఫిసియన్సీ, స్పెక్ట్రమ్ ఎఫిసియన్సీ మరియు నెట్‌వర్క్ ఎఫిసియన్సీ పెంచుతుందని పేర్కొన్నారు. ముందుగా దేశవ్యాప్తంగా ఎంపిక కొన్ని నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి.

అదే విధంగా రేపు ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఆరవ ఎడిషన్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఐఎంసీ-2022 “న్యూ డిజిటల్ యూనివర్స్” థీమ్‌తో అక్టోబర్ 1 నుండి 4 వరకు జరగనుంది. ఐఎంసీ-2022 ప్రముఖ ఆలోచనాపరులు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు మరియు ప్రభుత్వ అధికారులను ఒకచోట చేర్చి చర్చిండానికి మరియు డిజిటల్ టెక్నాలజీ యొక్క వేగవంతమైన అడాప్షన్ మరియు వ్యాప్తి నుండి ఉద్భవిస్తున్న ప్రత్యేక అవకాశాలను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + sixteen =