ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. విశిష్ట సేవా అవార్డులు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల సిబ్బందికి 140 శౌర్య పతకాలతో సహా 901 విశిష్ట సేవా పతకాలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శౌర్యం కోసం పోలీసు పతకం, విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు పతకం మరియు ప్రతిభావంతమైన సేవ కోసం పోలీసు పతకం పొందిన సిబ్బంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పిఎంజి) 140 మందికి, విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు మెడల్ (పిపిఎం) 93 మందికి మరియు మరో 668 మందికి పోలీస్‌ మెడల్ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు (పిఎం) లభించాయని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు పలు అవార్డులు వరించాయి. ఏపీకి 2 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ విశిష్ట సేవా అవార్డులు మరియు 15 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు దక్కాయి. అలాగే తెలంగాణకు 2 ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ విశిష్ట సేవా అవార్డులు మరియు 13 పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ పతకాలు దక్కాయి. తెలంగాణ నుంచి ఇంటిలిజెన్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనిల్‌ కుమార్, 12వ బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ రామకృష్ణలు రాష్ట్రపతి విశిష్ట సేవా అవార్డులకు ఎంపికయ్యారు. ఇక 140 శౌర్య అవార్డులలో, లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి 80 మంది సిబ్బంది మరియు జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 45 మంది సిబ్బంది దక్కించున్నారు.

ఇక అత్యధిక శౌర్య పతకాలు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (48) దక్కించుకోగా.. ఆ తర్వాత మహారాష్ట్ర పోలీసులకు 31, జమ్మూ మరియు కాశ్మీర్ పోలీసులకు 25, జార్ఖండ్ పోలీసులకు 9, ఛత్తీస్‌గఢ్ పోలీసులు, బోర్డర్‌లో ఒక్కొక్కరికి ఏడు పతకాలు లభించాయి. అలాగే భద్రతా దళం (బీఎస్ఎఫ్), ఢిల్లీ పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు నాలుగు పతకాలు సాధించగా, అస్సాం రైఫిల్స్ మరియు సీఐఎస్ఎఫ్‌ దళాలు ఒక్కో పతకం దక్కించుకున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 19 =