సినిమా టికెట్ల ధరల పరిశీలనకై కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh, andhra pradesh movie ticket price, AP Govt Appointed a New Committee to Look into the Prices of Movie Tickets, ap govt go on movie tickets, ap movie tickets news, AP Prices of Movie Tickets, ap theatres, ap ticket prices, AP Ticket Prices Issue, ap ticket rate issue, Committee to represent Tollywood before AP government, committee will hold talks with AP Govt, government cinema ticket booking, New Committee to Look into the Prices of Movie Tickets, new movie ticket rates in ap, Prices of Movie Tickets, Prices of Movie Tickets In AP, Telugu Film Ticket Pricing

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా సినిమా టికెట్ల ధరల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా, కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలాగే కమిటీ సభ్యులుగా పురపాలక, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శులు, సమాచార పౌరసంబంధాల కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటుగా ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉండనున్నారు. రాష్ట్రంలో ఏఏ థియేటర్స్ లలో, ఎంత టికెట్ ధర ఉండాలి? ధరల పెంపు సహా పలు అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరిపి, త్వరలోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =