భారత్ లో కోవోవ్యాక్స్, కార్బివాక్స్ వ్యాక్సిన్లతో పాటుగా మోల్నుపిరవిర్ డ్రగ్ కు ఆమోదం

Corbevax Covovax Molnupiravir approved for emergency use, COVID-19, Covid-19 vaccines, Govt approves emergency use of Corbevax, Govt gives emergency use approval to 2 Covid vaccines, Mango News, New Covid-19 Vaccines, Union Govt Approves Emergency Use of Corbevax, Union Govt Approves Emergency Use of Corbevax and Covovax, Union Govt Approves Emergency Use of Corbevax and Covovax Covid-19 Vaccines, Union Govt Approves Emergency Use of Corbevax and Covovax Covid-19 Vaccines and Molnupiravir Pill

కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశంలో మరో రెండు వ్యాక్సిన్ లు, ఒక యాంటీ వైరల్ డ్రగ్ అందుబాటులోకి రానుంది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న నానోపార్టికల్ వ్యాక్సిన్ అయిన కోవోవ్యాక్స్, హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే కరోనా చికిత్సలో భాగంగా మోల్నుపిరవిర్ అనే యాంటీవైరల్ డ్రగ్‌ (పిల్) కు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.

ముందుగా కోవోవ్యాక్స్, కార్బివాక్స్ వ్యాక్సిన్లతో పాటుగా మోల్నుపిరవిర్ డ్రగ్ అత్యవసర వినియోగ అనుమతులు పొందేందుకు ఆయా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ పరిశీలించి, ఆమోదానికి సిఫార్సు చేసింది. దీంతో ఒకే రోజు మూడింటికి అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించారు. కార్బివాక్స్ వ్యాక్సిన్ అనేది కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి ఆర్బీడీ ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ అని, ఇది భారతదేశంలో అభివృద్ధి చేయబడిన 3వ వ్యాక్సిన్ అని చెప్పారు.

ఇక మోల్నుపిరవిర్ అనే యాంటీవైరల్ డ్రగ్‌ని ఇప్పుడు దేశంలో 13 కంపెనీలు తయారుచేస్తున్నాయని, కోవిడ్-19తో బాధపడుతున్న పెద్దలకు మరియు వ్యాధి ముదిరే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్-19కు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ముందుండి నాయకత్వం వహించారని, ఈ ఆమోదాలన్నీ కోవిడ్ మహమ్మారిపై ప్రపంచ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. మన ఫార్మా పరిశ్రమలు ప్రపంచం మొత్తానికి ఆస్తి అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా పేర్కొన్నారు. ఇప్పటివరకు కోవిషీల్డ్, కొవాక్జిన్, స్పుత్నిక్-వీ, మోడర్నా, జాన్సన్‌ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్, జైడస్ కాడిలా యొక్క జైకోవి-డి, కోవోవ్యాక్స్, కార్బివాక్స్ వ్యాక్సిన్లతో కలిపి మొత్తం 8 వ్యాక్సిన్లకు దేశంలో అనుమతులు జారీ చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =