నగరంలో ఒవైసీ-మిధాని జంక్షన్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurated Owaisi-Midhani Junction Flyover at Hyderabad Today

హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురాగా, తాజాగా మరో కీలక ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ఒవైసీ-మిధాని జంక్షన్ల మధ్య 1.365 కి.మీ పొడవుతో జీహెఛ్ఎంసీ నిర్మించిన ఫ్లై ఓవర్ ను మంగళవారం నాడు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రారంభించారు. మొత్తం రూ.80 కోట్ల నిర్మాణ వ్యయంతో మూడు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో పాతబస్తీ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.

మరోవైపు ఈ ఫ్లై ఓవర్ కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించుకున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డిఆర్డీఓలో పనిచేయడం సహా ఒక దశాబ్దానికి పైగా ఈ పరిసరాల్లో నివసించిన గొప్ప వ్యక్తికి చిన్న నివాళిగా ఈ ఫ్లై ఓవర్ కు ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =