ఏపీలో రేపటి నుంచే నైట్ కర్ఫ్యూ విధింపు

Andhra Pradesh Coronavirus, Andhra Pradesh Coronavirus Cases, Andhra Pradesh Coronavirus News, Andhra Pradesh Night curfew, Andhra Pradesh Night curfew From Tomarrow, Andhra Pradesh Night curfew News, Andhra Pradesh Night curfew updates, AP Govt Decides To Impose Night Curfew, AP Govt Decides To Impose Night Curfew from 10 PM to 5AM, AP Govt Decides To Impose Night Curfew from 10 PM to 5AM from Tomorrow Onwards, AP Night curfew, Mango News, Night curfew In Andhra Pradesh, Night curfew In AP

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏప్రిల్ 24, శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 18-45 సంవత్సరాల వారందరికి మే 1వ తేదీ నుంచి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు.

సమావేశం అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కరోనా కట్టడి చర్యలపై పూర్తిస్థాయిలో చర్చించామని చెప్పారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్ అత్యంత ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ చెప్పారన్నారు. అందులో భాగంగా 18-45 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా ఉన్న వీరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే రేపటి నుండి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ ఆదేశించారని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =