కరోనా చికిత్సకు మరో ఔషధానికి డీసీజీఐ అనుమతి

Covid medicine, Covid Treatment, Mango News, Virafin, Zydus Cadila, Zydus Cadila receives Emergency Use Approval, Zydus Cadila Virafin Covid medicine approved, Zydus Cadila’s Virafin Approved, Zydus Cadila’s Virafin Gets Emergency Use Approval, Zydus Cadila’s Virafin Gets Emergency Use Approval from DGCI, Zydus Cadila’s Virafin Gets Emergency Use Approval from DGCI for Treating Moderate COVID-19 Cases, Zydus Cadila’s Virafin gets emergency use authorisation, Zydus gets DCGI emergency use approval for Virafin, Zydus gets emergency use approval for Virafin, Zydus’ Virafin gets emergency use approval

దేశంలో కరోనా విజృంభణతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. భారతీయ బహుళజాతి ఔషధ సంస్థ జైడస్‌ క్యాడిలా‌ తయారుచేసిన ‘విరాఫిన్‌’కు కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చారు. ఒకే మోతాదులో వాడే పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా 2బీ-విరాఫిన్ ‌యాంటీవైరల్‌ ఇంజక్షన్ మధ్యస్థాయి కరోనా లక్షణాలు ఉన్న రోగులచికిత్సలో మరింత ప్రయోజనకరంగా పని చేస్తుందని చెప్పారు.

అలాగే కరోనా సోకిన ప్రారంభ సమయంలో ఈ ఔషధం ఇస్తే వైరల్‌ లోడ్‌ను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. రోగులు వేగంగా కోలుకోవడానికి, తీవ్ర సమస్యల నుంచి బయటపడడానికి విరాఫిన్ సహాయపడుతుందని జైడస్‌ క్యాడిలా కంపెనీ తెలిపింది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో కరోనాతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న రోగులలో ఈ ఔషధం మెరుగైన క్లినికల్ ఫలితాలని చూపించదన్నారు. ఇక ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా కూడా విరాఫిన్ సమర్థతను చూపించిందని జైడస్‌ క్యాడిలా సంస్థ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =