నాగ చైతన్య-సమంత విడాకులు, అధికారికంగా ప్రకటన

Mango News, Naga Chaitanya, Naga Chaitanya And Samantha Divorce, Naga Chaitanya And Samantha Release Official Statement, Naga Chaitanya And Samantha Releases Official Statement, Naga Chaitanya And Samantha Releases Official Statement Regarding Their Separation, Samantha, Samantha Akkineni-Naga Chaitanya, Samantha Akkineni-Naga Chaitanya announce divorce, Samantha and Naga Chaitanya announce separation, Samantha Divorce, Samantha Ruth Prabhu And Naga Chaitanya Announce

ప్రముఖ యువ కథానాయకుడు నాగచైతన్య, ప్రముఖ నటి సమంతల జంట విడిపోతున్నట్టుగా ప్రకటించారు. తమ వివాహబంధానికి స్వస్తి చెబుతూ, విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గత కొద్దీ రోజులుగా వీరి వివాహబంధంపై వార్తలు వస్తుండగా, తాజాగా నాగ చైతన్య ట్విట్టర్‌ వేదికగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడిపోవడంపై అధికారికంగా ప్రకటనలు విడుదల చేశారు.

“మా శ్రేయోభిలాషులందరికీ… చాలా ఆలోచనలు మరియు చర్చలు తర్వాత మేము భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. దశాబ్ద కాలానికి పైగా స్నేహాన్ని కలిగి ఉండటం మా అదృష్టం, ఇది మా సంబంధంలో ప్రధానమైనది, ఇది ఎల్లప్పుడూ మా మధ్య ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మేము నమ్ముతున్నాము. మా అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు మీడియా ఈ కష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని మరియు మేము ముందుకు సాగడానికి అవసరమైన గోప్యతను ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. మీ మద్దతుకు ధన్యవాదాలు” అని నాగచైతన్య, సమంత పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eight =