ఏపీలో పంచాయితీ ఎన్నికలు, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

Andhra Gram Panchayat elections, Andhra Pradesh panchayat elections, Andhra Pradesh panchayat elections News, Andhra Pradesh Panchayat Polls, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections Schedule, AP Panchayat Elections, AP Panchayat polls, AP Panchayat polls 2021, Gram Panchayat Elections In AP, Green Signal to Conduct Panchayat Elections in AP, Mango News, Panchayat Elections in AP

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో ఓవైపు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుండడంతో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.

ముందుగా డివిజన్ బెంచ్ ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై విచారణ అనంతరం రిజర్వు చేసిన తీర్పును హైకోర్టు గురువారం నాడు వెలువరించింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + one =