9 నుంచి 12 క్లాస్ విద్యార్ధులు అమ్మఒడి డబ్బు వద్దని భావిస్తే వారికీ ల్యాప్‌టాప్‌ లు: సీఎం జగన్

Amma Vodi Scheme, Amma Vodi Scheme News, Ammavodi Scheme, Ammavodi Scheme Second Phase at Nellore, Andhra Pradesh Latest News, AP Breaking News, AP CM YS Jagan, AP CM YS Jagan Launch Amma Vodi Scheme, AP CM YS Jagan Launches Ammavodi Scheme, Ap Political News, AP Political Updates, Jagananna Ammavodi, Mango News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన “జగనన్న అమ్మఒడి” రెండో ఏడాది చెల్లింపులను నెల్లూరులో ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని 1 వ తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకూ వర్తింపజేస్తున్నారు. గత ఏడాది జనవరి 9న దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు. ఈసారి మరింత మందికి ప్రయోజనం కలిగేలా పలు నిబంధనల సడలింపు ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,673 కోట్లును జమచేసే పక్రియను సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పేదరికంతో ఆర్థిక స్థోమత లేక పిల్లలను చదివించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని పాదయాత్రలో చూశానని అన్నారు. అందుకే ప్రతి నిరుపేద విద్యార్థుల తల్లులకు నేరుగా వారి ఖాతాలో జమ చేసే విధంగా ఈ పథకాన్ని అమలు చేశానని పేర్కొన్నారు. ఆర్థికంగా వారిని మెరుగుపరిచే విధంగా ప్రతి విద్యార్థి బడికి పంపించి ఉన్నత విద్యను అందించాలని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో అమ్మ ఒడి పథకం అమలు చేశానని అన్నారు. నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, అమ్మఒడి ఇలా విద్యార్థుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తూ విద్యా విధానం ఎప్పటికప్పుడు మెరుగుపడేలా చేస్తామన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలను రూపురేఖలు మార్చే దిశగా మరో నాలుగు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.

అమ్మఒడి డబ్బు వద్దని భావిస్తే వారికీ ల్యాప్‌టాప్‌ లు: సీఎం వైఎస్ జగన్

ఇక విద్యార్ధులకు అందించే అమ్మఒడి పథకంపై సీఎం మరో కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల కంప్యూటర్ స్కిల్స్‌ పెంచేందుకు ల్యాప్‌టాప్ ఆఫర్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతుల విద్యార్ధులకు మాత్రం అమ్మఒడి డబ్బు వద్దని భావిస్తే వారికీ ల్యాప్‌టాప్‌ లు అందజేస్తామని సీఎం‌ తెలిపారు. విండోస్ 10 ఓఎస్, 4 జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్‌డిస్క్‌‌ ఫీచర్స్‌తో ఈ ల్యాప్‌టాప్ లు అందిస్తామని, మూడేళ్ల వరకు వాటికీ వారంటీ కూడా కల్పించి విద్యార్థులకు అందిస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − four =