ఏపీలో వరద బాధితులకు అండగా ఏపీఎండీసీ, సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం

AP APMDC Donates Rs 5 Cr To CM Relief Fund For Helping Flood Victims, APMDC Donates Rs 5 Cr To CM Relief Fund For Helping Flood Victims, 5 Cr To CM Relief Fund For Helping Flood Victims, AP Andhra Pradesh Mineral Development Corporation, Andhra Pradesh Mineral Development Corporation Donates Rs 5 Cr To CM Relief Fund For Helping Flood Victims, Andhra Pradesh Mineral Development Corporation, Chief Minister Relief Fund, APMDC has contributed Rs 5 crores to Chief Minister Relief Fund For Helping Flood Victims, AP APMDC Donates Rs 5 Cr To CMRF, AP APMDC, Chief Minister Relief Fund News, Chief Minister Relief Fund Latest News, Chief Minister Relief Fund Latest Updates, Chief Minister Relief Fund Live Updates, Mango News, Mango News Telugu,

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతాలను అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో వరదల వలన నష్టపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను చేపట్టింది. ఈ క్రమంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ (ఏపీఎండీసీ) తమవంతు చేయూతగా రూ.5 కోట్ల భారీ విరాళం అందజేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళానికి సంబంధించిన చెక్‌ను సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అందించింది. సోమవారం గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి చెక్ అందజేశారు. వరద సహాయక చర్యలకు దీనిని ఉపయోగించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏపీఎండీసీ అధికారులని అభినందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seven =