వాహన నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt has Increased Fines Heavily, AP Govt has Increased Fines Heavily on Vehicle Regulations Violations, AP govt issues key orders on motor vehicle rules violation, AP News, Penalties for traffic rule violations increased, Penalties for traffic rule violations increased In AP, Traffic rule violators, Vehicle Regulations Violations

రాష్ట్రంలో వాహన నిబంధన ఉల్లంఘనలపై జరిమానాలను పెంచుతూ ఏపీ‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ద్విచక్ర వాహనాల నుంచి నాలుగు చక్రాల వాహనాలు వరకు ఒక కేటగిరీగా, ఇతర భారీ వాహనాలను మరో కేటగిరీగా విభజించి జరిమానాలను పెంచినట్టు వెల్లడించారు. అలాగే పలుసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుందని పేర్కొన్నారు.

పెంచిన జరిమానాల వివరాలు ఇవే:

  1. సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు ప్రమాదకర డ్రైవింగ్ కు : రూ. 10000 జరిమానా
  2. వేగంగా బండి నడిపిన వారికీ : రూ. 1000 జరిమానా
  3. రేసింగ్ లో మొదటిసారి పట్టుబడితే : రూ. 5000
  4. రేసింగ్ లో రెండో సారి పట్టుబడితే : రూ. 10000
  5. వాహనాల చెకింగ్ సమయంలో విధులకు ఆటంకం కలిగిస్తే : రూ. 750
  6. వాహనాల సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే : రూ. 750
  7. అనుమతి లేని వ్యక్తులకి వాహనాలు ఇస్తే : రూ. 5000
  8. అర్హత కంటే తక్కువ వయస్సు వారికి నడిపేందుకు వాహనం ఇస్తే : రూ. 5000
  9. డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వ్యక్తులకు వాహనం ఇస్తే : రూ. 10000
  10. నిర్ణిత రూల్స్ పాటించకుండా, వాటికీ వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే : రూ. 5000
  11. వాహనానికి రిజిస్ట్రేషన్ లేకపోయినా మరియు ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేకపోయినా : మొదటిసారిగా రూ. 2000 జరిమానా, రెండో సారి : రూ. 5000 జరిమానా
  12. పర్మిట్ లేని వాహనాలు నడిపిస్తే : రూ. 10000
  13. ఓవర్ లోడ్ తో వాహనాలు నడిపిస్తే : రూ.20000, ఆపై టన్నులకు రూ. 2000 అదనం
  14. బరువు చెకింగ్ కోసం వాహనం ఆపకపొతే : రూ. 40000
  15. ఎమర్జెన్సీ వాహనాలకు రోడ్డుపై దారి ఇవ్వకుంటే : రూ. 10000
  16. అవసరం లేకున్నా హారన్ మోగిస్తే : మొదటిసారి రూ. 1000 జరిమానా, రెండోసారి రూ. 2000 జరిమానా
  17. నిబంధనలకు వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు/డీలర్లకు/అమ్మినినవారికి : రూ. లక్ష జరిమానా

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eight =