ఏపీలో ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు, సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లోకే…

Andhra Pradesh, Andhra Pradesh Government, Andhra Pradesh News, AP Govt Changes In Free Power Supply, AP Govt Free Power Scheme, AP Govt Made Key Changes in Free Power Scheme, Free electricity to farmers, Key Changes in Free Power Scheme, Key Changes in Free Power Scheme of Farmers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం నిమిత్తం రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత విద్యుత్ పథకంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు వచ్చిన బిల్లును ఉచిత విద్యుత్‌ సబ్సిడీ కింద నెలవారీగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేయనుంది. ఆ బిల్లులను అనంతరం రైతులే డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇకపై పాటించే వ్యవసాయ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం మార్గదర్శకాలను సెప్టెంబర్ 1, మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం సూచనల మేరకే ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 8 =