మే 16వ తేదీన రైతు భరోసా కార్యక్రమం, గణపవరంకు రానున్న సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan to tour in Eluru District on May 16th to Participate in YSR Rythu Bharosa Program, YS Jagan to tour in Eluru District on May 16th to Participate in YSR Rythu Bharosa Program, CM YS Jagan to tour in Eluru District on May 16th to Participate in YSR Rythu Bharosa Program, YS Jagan to tour in Eluru District on May 16th, AP CM YS Jagan to tour in Eluru District on May 16th, AP CM YS Jagan to Participate in YSR Rythu Bharosa Program on May 16th, YSR Rythu Bharosa Program, AP CM YS Jagan to tour in Eluru District, AP CM YS Jagan Eluru District Tour, CM YS Jagan Eluru District Tour News, CM YS Jagan Eluru District Tour Latest News, CM YS Jagan Eluru District Tour Latest Updates, CM YS Jagan Eluru District Tour Live Updates, Eluru District, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మే 16, సోమవారం నాడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి జిల్లాలోని గణపవరంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. 2022-23 సంవత్సరానికి గానూ రైతు భరోసా మొదటి విడత నిధులను సీఎం వైఎస్ జగన్ మే 16న గణపవరం జరిగే కార్యక్రమంలో విడుదల చేసి, రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ సందర్భంగా ఈ పథకం కింద పలువురు రైతులకు సీఎం చెక్కులను పంపిణీ చేయనున్నారు. గణపవరంలో సీఎం పర్యటన నేపథ్యంలో నేడు సభా వేదిక, హెలిప్యాడ్ సహా ఇతర ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పర్యవేక్షించి, అధికారులకు సూచనలు చేయనున్నారు.

2019-20 సంవత్సరం నుంచి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తుండగా, ఇప్పటికే 20 వేల కోట్లకు పైగా సాయాన్ని ఏపీ ప్రభుత్వం రైతులకు అందించింది. ఈ సంవత్సరం మొదటి విడతతో భాగంగా రూ.7,500 చొప్పున 48.77 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.3,657.87 కోట్ల నగదును విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.13750 అందిస్తుండగా, మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో సంక్రాతి సమయంలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 20 =