ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఆర్టీసీలో 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు

AP Govt Issued Orders For Providing Jobs To 1168 People in RTC Under Compassionate Appointments,AP Govt Issued Orders For Providing Jobs,Jobs To 1168 People in RTC,RTC Jobs Under Compassionate Appointments,Mango News,Mango News Telugu,Andhra Pradesh Government Issuance of orders,AP CM YS Jagan Mohan Reddy,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra pradesh Politics,AP Compassionate Appointments Latest News,AP Compassionate Appointments Latest Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో కారుణ్య నియామకాల కింద 1,168 మందికి ఉద్యోగాలు కల్పించింది. 2016 – 2019 మధ్య కాలంలో మృతి చెందిన సిబ్బంది వారసులకు సంస్థలో వారి అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. విలీనం తర్వాత, సర్వీసులో మరణించిన అర్హులైన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల సమస్యపై కూడా దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత కొన్ని రోజుల కింద ఉత్తర్వులు జారీ చేశారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్టీసీ, కలెక్టర్‌ పూల్‌ల పరిధిలోని ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో జనవరి 1, 2020 లోపు సర్వీస్‌లో ఉండగా మరణించిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై ఆధారపడిన వారికి కారుణ్య ఉద్యోగాన్ని అందించడానికి అనుమతిని ఇచ్చింది. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమల రావు ఆయా అభ్యర్థులకు వారి విద్యార్హతలను బట్టి పోస్టులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం.. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 34 మంది, 146 మందికి ఆర్టీసీ కానిస్టేబుల్స్ పోస్టులునియమించారు. అలాగే 175 మందికి కండక్టర్లుగా, 368 మందికి డ్రైవర్లుగా మరియు 445 మందికి శ్రామిక్ (లేదా) అసిస్టెంట్ మెకానిక్స్ పోస్టులను కేటాయించారు.

ఇక ప్రభుత్వ నిర్ణయంపై ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2016 నుంచి సర్వీస్‌లో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల అంశాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని, అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరించారని వారు అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల సమస్యను పరిష్కరించినందుకు గానూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఇక ఉద్యోగాలు ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకున్నందుకు ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని ఉద్యోగాలు పొందిన 1,168 మంది పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 7 =