అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణల ధ్రువీకరణ.. అరెస్ట్ చేస్తారా? స‌రెండ‌ర్ అవుతారా?

Former US President Donald Trump Indicted Over Hush Money by a Manhattan Grand Jury,Former US President Donald Trump,Donald Trump Indicted Over Hush Money,Hush Money by a Manhattan Grand Jury,Mango News,Mango News Telugu,Donald Trump indicted by Manhattan grand jury,Donald Trump indicted by New York grand jury,Donald Trump indicted over hush money,Donald Trump indictment,Donald Trump Is Indicted in New York,Trump indicted in New York,US President Donald Trump Latest News,US President Donald Trump Latest Updates

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒక అడల్ట్ స్టార్‌కు చేసిన డబ్బు చెల్లింపులపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ అభియోగాలు మోపింది. అలాగే ఆయనపై నమోదైన లైంగిక నేరారోపణలను న్యూయార్క్ కోర్టు ధ్రువీకరించింది. కాగా అమెరికా చ‌రిత్ర‌లో ఒక మాజీ అధ్య‌క్షుడిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు కావ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. దీంతో ఏప్రిల్ 4న డొనాల్డ్ ట్రంప్ కోర్టు ముందు స‌రెండ‌ర్ అవుతారా? లేక పోలీసులే ఆయనను అరెస్ట్ చేస్తారా? అని అంతటా ఉత్కంఠ నెలకొంది. కాగా ఇది హై-ప్రొఫైల్ కేసు కావడంతో యూఎస్ సీక్రెట్ సర్వీస్ మరియు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ హింసాత్మక నిరసనలను దృష్టిలో ఉంచుకుని భారీ భద్రతను ఏర్పాటు చేస్తోంది.

కాగా 2006లో డొనాల్డ్ ట్రంప్ తనతో శృంగారం చేశారని, అడల్ట్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ అనే నటి ఆరోపించింది. 2016 ఎన్నికలకు ముందు ట్రంప్ లాయరు తనకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని, ఈ విషయం బయటపెట్టకూడదంటూ తనను బెదిరించారని డేనియల్స్‌ తెలిపారు. ఆమె ఆరోపణలను ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాది నిజమేనని ప్రకటించారు. ఆ సమయంలో ట్రంప్ మాజీ లాయర్‌ మైఖేల్ కోహెన్ 1,30,000 డాలర్లు డేనియల్స్‌కు ముట్టజెప్పారని, తరువాత ఆ మొత్తాన్ని కోహెన్‌కు ట్రంప్ అందజేశారని న్యాయవాది రూడీ గియూలియానీ చెప్పారు. అయితే రికార్డుల్లో ఈ మొత్తాన్ని లీగల్ ఫీజు కింద చెల్లించినట్టు ఉండటం గమనార్హం. దీంతో ఈ కేసులో ఐదేళ్లుగా ట్రంప్‌పై విచారణ కొనసాగుతున్నది.

ఒక నివేదిక ప్రకారం, డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ తన వేలిముద్రలు మరియు మగ్ షాట్‌ను న్యూయార్క్‌లో నేరపూరిత అరెస్టు కోసం అనుసరించిన ప్రోటోకాల్స్‌లో భాగంగా తీసుకుంటారు. ఇక అన్ని ప్రక్రియలు పూర్తయ్యే వరకు ప్రతివాదులు సాధారణంగా చాలా గంటల పాటు పోలీసుల అధీనంలో నిర్బంధించబడతారు. న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం, ప్రచార-ఆర్థిక ఉల్లంఘనలో వ్యాపార రికార్డులను తప్పుదారి పట్టించడం తక్కువ స్థాయి కలిగిన నేరం. దీనికి నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అయితే అమెరికా చట్టం నేరారోపణ కింద లేదా జైలులో ఉన్న ఒక వ్యక్తి ఓవల్ పదవికి పోటీ చేయడానికి మరియు అధ్యక్షుడిగా కూడా పనిచేయడానికి అనుమతిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + thirteen =