తెలంగాణలో 96 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Corona in Telangana 96 Positive Cases 109 Recoveries Reported on September 29, Telangana Records 96 New Covid Cases, 109 Covid Recoveries September 29th, Mango News, Mango News Telugu, Telangana Logs 96 Covid Positive Cases, 96 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 668 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 96 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 29, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,37,792 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 47 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.43 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 109 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,33,013 కు చేరుకుంది. ప్రస్తుతం 668 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. గురువారం నాడు 9,477 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,76,68,580 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,12,052 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 436 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 5 =