ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు?

4 Candidates to Governor for the MLC Posts under Governor Quota, Andhra Pradesh Legislative Council, AP Govt, AP Govt Referred 4 Candidates to Governor for the MLC Posts, AP Govt Referred 4 Candidates to Governor for the MLC Posts under Governor Quota, AP MLC Posts under Governor Quota, Four names finalised by AP govt for MLC posts, Mango News, MLC post under governor’s quota, MLC Posts under Governor Quota, MLC Posts under Governor Quota In AP, MLC seats in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో గవర్నర్‌ కోటాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో (జూన్ 11, శుక్రవారం) పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ వద్దకు రాష్ట్ర ప్రభుత్వం దస్త్రాన్ని పంపినట్లు తెలిసింది. ఎమ్మెల్సీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వారిలో తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేను రాజు, కడప జిల్లాకు చెందిన ఆర్వీ రమేశ్‌ యాదవ్‌, గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు జూన్‌ 11తో పదవీకాలం పూర్తికానున్న ఎమ్మెల్సీలలో బీద రవిచంద్ర, పి.శమంతకమణి, టీడీ జనార్దన్‌, గౌనిగారి శ్రీనివాసులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here