రాజ్యసభ ఎన్నికలపై ఏపీ సీఎం వ్యూహం

Jagan , AP CM's Strategy, Rajya Sabha Elections,Elections,AP CM Jagan, Golla Baburao, YCP, TDP, YSRCP, Andhra Pradesh News Updates, AP Political News, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Jagan , AP CM's Strategy, Rajya Sabha Elections,Elections,AP CM Jagan, Golla Baburao, YCP, TDP

రాజ్యసభ ఎన్నికల విషయంలో ఏపీ సీఎం జగన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు.  గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన రిజల్ట్‌నే20 గుణపాఠంగా చేసుకున్న జగన్ మరోసారి ఆ తప్పు జరగకుండా అన్ని జాగ్గత్తలు తీసుకుంటున్నారు. రాజ్యసభ స్థానాలకు పోటీ చేసే తమ అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావుల పేర్లను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలతో, మరో ఎస్సీ నేతను ఎంపిక చేశారు. మరోవైపు టీడీపీ కూడా రాజ్యసభ సీటుకోసం  ఎస్సీ నేతను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ముందుగా జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులకు టిక్కెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ఏ లెక్కలు పనిచేసాయో కానీ.. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు, కేసులు ఉన్న విజయానంద రెడ్డికి టికెట్ కట్టబెట్టారు. దీంతో  శ్రీనివాసులకు రాజ్యసభ సీటు ఇస్తారని అంతా అనుకున్నా.. చివరి నిమిషంలో కడప జిల్లా రాజంపేటవాసి అయిన రఘునాథ్ రెడ్డికి ఆ టికెట్‌ను కేటాయించారు. రాజంపేటలో  సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించడంతో.. ఆయన తమ్ముడికి రాజ్యసభ ఇచ్చి జగన్ సంతృప్తి చేస్తున్నారు.

మరోవైపు గొల్ల బాబూరావు ఎంపిక వైసీపీ అధినేత వ్యూహాత్మకమేనన్న వాదన వినిపిస్తోంది. పార్టీలో కొంతమంది సిట్టింగ్లను మార్చారు. మరికొందరికి స్థానచలనం కల్పించి..కొందరిని పక్కన పెట్టేసారు. ఇలా పక్కన పెట్టిన వాళ్లల్లో ఎస్సీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉండటంతో.. వైసీపీ పైన వారంతా ఆగ్రహంగా ఉన్నారు. జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీళ్లంతా  రాజ్యసభ ఓటింగ్ లో తమ ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకే జగన్ వ్యూహాత్మకంగా ఎస్సీ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

మరోవైపు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంతో గొల్ల బాబూరావు సీఎం జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గొల్ల బాబూరావుకు పాయకరావుపేట టికెట్ నిరాకరించారు. కానీ తాజాగా  రాజ్యసభకు ఎంపిక చేశారు. మరోవైపు టీడీపీ కూడా దళిత అభ్యర్థిని రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అటు సీటు దొరకని  వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి వైపు మొగ్గుచూపితే బాబూరావు ఓడిపోవడం గ్యారంటీ. ఒకవేళ అదే జరిగితే దళిత అభ్యర్థిని ఓడించారని వైసీపీ ప్రచారం చేసుకోవచ్చు. అలాగే తమపై వ్యతిరేక గళం వినిపించిన గొల్ల బాబురావును ఇంటికి పంపించామని  వైసీపీ సంతృప్తి పడే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =