వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్‌ అవార్డుల గైడ్‌లైన్స్‌ విడుదల

AP Govt Guidelines For YSR Lifetime Awards, AP Govt Releases Guidelines For YSR Lifetime Awards, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, AP Releases Guidelines For YSR Lifetime Awards, Guidelines For YSR Lifetime Awards, Mango News Telugu, YSR Lifetime Awards

రాష్ట్రంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులతో సత్కరించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో వారి అత్త్యుత్తమ ప్రతిభతో ప్రజలకు విశేషంగా సేవలు అందించిన వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అవార్డులను ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అవార్డులకు సంబంధించిన మార్గదర్శకాలను నవంబర్ 6, బుధవారం నాడు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రెండు విడతలగా మొత్తం 100 అవార్డులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేస్తారని పేర్కొన్నారు. ఈ పురస్కారం కింద రూ.10 లక్షల నగదు బహుమతితోపాటు, జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు. సాధారణ పరిపాలన శాఖ రాజకీయ విభాగం ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన అర్హులను ఎంపిక చేసేందుకు ఒక కమిటీని సీఎం నియమిస్తారని తెలిపారు. మొత్తం 11 విభాగాల్లో సేవలందించిన వ్యక్తులను గుర్తించి ఈ అవార్డులు అందజేస్తారు.

అవార్డులు పొందే రంగాలు:

 • సామాజిక సేవ
 • ప్రజావ్యవహారాలు
 • సైన్స్, ఇంజినీరింగ్‌
 • వాణిజ్య, వ్యాపార రంగాలు
 • ప్రింట్‌ మీడియా
 • ఎలక్ట్రానిక్‌ మీడియా
 • వైద్య రంగం
 • కళలు, సాహిత్యం, విద్య
 • ప్రజాసేవ
 • క్రీడారంగం
 • మానవ హక్కులు-జీవవైవిధ్య పరిరక్షణ

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here