గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా

Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, APPSC Group 1 Main Exam 2019 postponed, APPSC Group I Mains Exam 2019 Postponed, APPSC Postpone Group 1 Mains, APPSC Postpone Group 1 Mains Exams, APPSC Postpones Group 1 mains exam, Group-I Mains scheduled for Dec postponed, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ లో డిసెంబరులో జరగాల్సిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ముందుగా డిసెంబరు 12 నుంచి 23వ తేదీల మధ్య ఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. అయితే ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి, మెయిన్స్ పరీక్షల నిర్వహణకు మధ్య సమయం తక్కువగా ఉండడం, అభ్యర్థుల సంఖ్య ఎక్కువుగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు ఈ పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి మరింత సమయం కావాలని అభ్యర్థుల నుంచి వస్తోన్న విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. అన్ని అంశాలను పరిశీలించిన తరువాత పరీక్షలను వాయిదా వేసినట్టు నవంబర్ 6, బుధవారం నాడు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను జనవరిలో మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. తదుపరిగా పరీక్షలు నిర్వహించే తేదీలను నవంబర్ 13వ తేదీలోగా ప్రకటిస్తామని తెలిపారు.

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here