ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ ల బదిలీ

16 IAS Officers Transferred, AP Govt, AP Govt Transferred 16 IAS Officers, AP Govt Transferred 16 IAS Officers Including 5 Districts Collectors, AP Govt Transferred 5 Districts Collectors, AP Govt Transferred Districts Collectors, AP IAS Officers Transferred, AP Senior IAS Officers, IAS Officers Transferred In AP, IAS Officers Transferred News, Mango News, Senior IAS Officers, Several IAS Officers Transferred In Andhra Pradesh, Several IAS Officers Transferred In AP, Transfers IAS Officers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు జరిగాయి. మొత్తం 16 మంది అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీ అయిన వారిలో కడప జిల్లా కలెక్టర్ సీహెచ్‌.హరికిరణ్‌, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కలెక్టర్ వినయ్‌చంద్‌, విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌, కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్‌ కూడా ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:

  1. వైద్యశాఖ ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా మురళీధర్‌రెడ్డి నియామకం
  2. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్‌ గా విజయరామరాజు
  3. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ గా సీహెచ్‌.హరికిరణ్‌
  4. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈవోగా వినయ్‌చంద్‌
  5. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ గా ఎ.మల్లికార్జున
  6. ఆర్‌అండ్ఆర్‌ కమిషనర్‌ గా హరిజవహర్‌లాల్‌
  7. విజయనగరం జిల్లా కలెక్టర్‌ గా ఎ.సూర్యకుమారి
  8. పౌరసరఫరాలశాఖ వైస్ చైర్మన్ అండ్ ఎండీగా జి.వీరపాండియన్‌
  9. కర్నూలు జిల్లా కలెక్టర్‌ గా పి.కోటేశ్వరరావు
  10. వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా కె.వెంకటరమణారెడ్డి
  11. పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్(ఆర్బీ అండ్ ఆర్) గా సుమిత్‌కుమార్‌ బదిలీ
  12. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్(ఆర్బీ అండ్ ఆర్) గా బి.ఆర్‌.అంబేద్కర్
  13. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ గా పి.అర్జున్‌రావు
  14. దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌కు దేవాదాయ కమిషనర్‌ గా కూడా అదనపు బాధ్యతలు అప్పగింత
  15. చిత్తూరు జాయింట్ కలెక్టర్(ఆర్బీ అండ్ ఆర్) గా స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌
  16. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా ఎం.ప్రభాకర్‌రెడ్డి
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =